![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -60 లో.... రామరాజు ఎక్కడ అంటూ వేదవతి ఇంట్లో అంతా వెతుకుతుంటుంది. ఎక్కడా కన్పించకపోవడంతో వేదవతి టెన్షన్ పడుతూ అందరికి చెప్తుంది. ఆ తర్వాత నాన్న ఎక్కడున్నాడో నేను చూసి వస్తానంటూ చందు వెళ్తాడు. చందు అంతా వెతికి చివరికి మిల్ కి వెళ్తాడు. అక్కడ నేలపైన రామరాజు పడుకొని ఉండటం చందు చూస్తాడు.
అలా రామరాజుని ఆ సిచువేషన్ లో చూసి చందు ఎమోషనల్ అవుతాడు. చందు వెళ్లి రామరాజుని లేపి మీరు ఇక్కడున్నారేంటని అడుగగా.. మరేం చెయ్యాలి నా స్థాయి ఇదేనంటూ రామరాజు బాధపడతాడు. ముగ్గురు కొడుకులు నా మాట వింటారని చాలా మురిసిపోయాను కానీ నడిపోడు, చిన్నడు నా పరువు తీశారంటూ రామరాజు బాధపడుతాడు. కాసేపటికి నాన్న ఇంటి దగ్గర అమ్మ ఏడుస్తుందని చందు చెప్పగానే.. అవునా పదా వెళదామంటూ రామరాజు అంటాడు. ఇక ఇద్దరు ఇంటికి వస్తారు. రామరాజుని చూసి ఇంట్లో అందరు హ్యాపీగా ఫీలవుతారు. అలా ఎందుకు వెళ్లారండని వేదవతి అడుగగా.. నీ వల్లే వెళ్ళాను.. నీ వల్లే వాడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నువ్విచ్చిన ధైర్యం వల్లే పెళ్లి చేసుకున్నాడని రామారాజు అనగానే.. వేదవతి, నర్మద, ధీరజ్, ప్రేమ వాళ్లు నిజం తెలిసిపోయిందని కంగారుపడతారు.
ఆ తర్వాత రామరాజు లోపలికి వెళ్తాడు. పదండి అత్తయ్య లోపలికి వెళదామని నర్మద అనగానే.. నేను రాను అంటూ వేదవతి భయపడుతుంది. లోపలికి వెళ్ళకు.. అంత నీవల్లే కదా ఎప్పుడు వెనకేసుకొని వచ్చావ్.. ఇంట్లో వద్దంటే మళ్ళీ గొడవ చేసి ఇంట్లోకి రప్పించావ్.. నేను తిట్టిన ప్రతిసారీ మా అమ్మ నా వెనకాల ఉందని అనుకునేవాడు.. బాగా గారాబం చేసావని రామరాజు అంటాడు. హమ్మయ్య నిజం తెలియదని వేదవతి వాళ్లు రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత ధీరజ్ మాట్లాడుతుంటే.. నువ్వు నాతో మాట్లాడకని రామరాజు అంటాడు. నేను మాట్లాడతానని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |